టాలీవుడ్ లో ప్రయోగాలు చేసే వారిలో సుధీర్ బాబు కూడా ముందుంటాడు. సినిమా జయాపజయాలను పక్కనపెట్టి తన ప్రతి సినిమాకి కూడా ఏదో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సుధీర్ బాబు. ఈ ఏడాది హంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా మామ మశ్చీంద్ర.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో సుధీర్ బాబు పలు గెటప్పుల్లో కనిపించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా చిత్రయూనిట్ సుధీర్ బాబు లుక్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. దుర్గ అనే రోల్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేయగా.. సుధీర్ షాకింగ్ లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి సినిమాలో ఎంతో ఫిట్ నెస్ తో కనిపించే సుధీర్ ఇలాంటి రోల్ లో కనిపిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెంచేశాడు.
కాగా ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీజీ విందా సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను తెలుగుతో పాటు హిందీ లో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: