విరూపాక్ష టీజర్ చూసిన పవన్ – మామకు అల్లుడు థ్యాంక్స్

Power Star Pawan Kalyan Watched Sai Dharam Tejs Virupaksha-movie-teaser,Latest 2023 Telugu Movie,2023 Telugu Teasers,2023 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2023,2023 Latest Telugu Teasers,Latest Telugu Movies 2023,Telugu Filmnagar,New Telugu Movies 2023,Latest Movie Teaserpawan Kalyan New Movie,Pawan Kalyan Movies,Pawan Kalyanupcoming Movie,Pawan Kalyan Latest Movie,Movie Updates,Sai Dharam Tejs Latest Movie News,Sai Dharam Tejs New Movie Update,Sai Dharam Tejslatest Movie Update,Virupaksha Teaser,Virupaksha Movie Teaser,Irupaksha Telugu Movie Teaser,Virupaksha Telugu Teaser,Virupaksha Official Teaser,Pawan Kalyan,Sai Dharam Tejs,Pawan Kalyan Watched Virupaksha Movie Teaser,Sai Dharam Tejs Virupaksha Movie Teaser Pay Attention By Pawan Kalyan, Power Star Pawan Kalyan Observe Sai Dharam Tejs Virupaksha-movie-teaser,Virupaksha Movie Teaser Latest Movie News,Pawan Kalyan View Sai Dharam Tejs Virupaksha-movie-teaser

మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తన సినిమాలతో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి తేజ్. గత ఏడాది రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి తేజ్ ప్రస్తుతం మరో థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా విరూపాక్ష సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసేందుకు సిద్ద మవుతున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా టీజర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చూపించారు విరూపాక్ష మేకర్స్. ఈనేపథ్యంలో సాయి తేజ్ కూడా తన ట్విట్టర్ ద్వారా మామకు థ్యాంక్స్ చెప్పాడు. ఇంకేమీ అడగలేను. విరూపాక్ష నాకు చాలా కీలకమైన సినిమా.. నా గురువు కళ్యాణ్ గారి ఆశీస్సులు, ఆయన చెప్పిన మంచి మాటలు.. ఇలాంటి క్షణాన్ని ప్రారంభించడం ఒక వేడుక. కళ్యాణ్ మామా మీ ప్రేమకు, ప్రశంసలకు మరియు ఎల్లప్పుడూ మీరు నా కోసం నిలబడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ కథానాయిక గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈసినిమాకు కాంతార సెన్సేషన్ అంజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 7 =