పవన్-సాయి తేజ్ మూవీ షూటింగ్ స్టార్ట్

Pawan Kalyan And Sai Dharam Tej Remake Movie Shoot Begin,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kalyan New Movie,Pawan Kalyan Movies,Pawan Kalyan Upcoming Movie,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Movie Updates,Pawan Kalyan Latest Movie News,Pawan Kalyan New Movie Update,Pawan Kalyan Latest Movie Update,Sai Dharam Tej Movie Updates,Sai Dharam Tej Latest Movie News,Sai Dharam Tej New Movie Update,Sai Dharam Tej Latest Movie Update,Pawan Kalyan And Sai Dharam Tej Shoot Begin,Pawan Kalyan And Sai Dharam Tej Remake Movie Shoot Begin,Pawan Kalyan Remake Movie Shoot Begin,Sai Dharam Tej Remake Movie Shoot Begin,Pawan Kalyan And Sai Dharam Tej Remake Movie Cut Down Begin

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు. అంతేకాదు డైరెక్ట్ సినిమా కంటే కూడా రీమేక్ సినిమాలే ఎక్కువగా చేస్తున్నాడు పవన్. ఇప్పటికే భీమ్లానాయక్, వకీల్ సాబ్ రెండూ కూడా రీమేక్ సినిమాలే. ఇప్పుడు మరో సినిమాను రీమేక్ చేయనున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయినా వినోదయ సీతం అనే సినిమాను పవన్ రీమేక్ చేయబోతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వచ్చాయి. ఇన్ని రోజుల తరువాత ఆ సినిమాపై క్లారిటీ వచ్చేసింది. రెండు రోజుల క్రితమే ఈసినిమాపై అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ఇక్కడ తెలుగులో రీమేక్ చేస్తున్నారు సముద్రఖని. ఇందులో పవన్ తోపాటు.. హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటించనున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం నేడు ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఈసినిమా షూట్ ని వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు పవన్. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా నటించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈ సినిమాతోపాటు.. డైరెక్టర్ హరిష్ శంకర్ దర్శకత్వంలోనూ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటించనున్నారు. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =