ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నతీస్తున్నారు. హిప్ హప్ తమిళ సంగీతం అందించారు. ఏజెంట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, మేకింగ్ వీడియో, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఏజెంట్ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా ఏప్రిల్ 28వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏజెంట్ మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ కై చిత్ర యూనిట్ మస్కట్ చేరుకుంది. ఈ షెడ్యూల్ లో ఒక హెవీ డ్యూటీ యాక్షన్ సీన్ ను దర్శకుడు తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్ తో ఏజెంట్ మూవీ టోటల్ షూటింగ్ పూర్తికానుంది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఏజెంట్ మూవీకై ప్రేక్షక, అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సూపర్ హిట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ తరువాత అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: