మరో అంతర్జాతీయ నామినేషన్స్ లో ఎన్టీఆర్, చరణ్

Ntr And Ram Charan Get Nominated In Critics Choice Super Awards,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Ntr New Movie,Ntr Movies,Ntr Upcoming Movie,Ntr Latest Movie,Ram Charan Movie Updates,Ram Charan Latest Movie News,Ram Charan New Movie Update,Ram Charan Latest Movie Update,Ntr And Ram Charan Get Nominated For Super Awards, Ram Charan Propose For Super Awards, Ntr Propose For Super Awards, Ram Charan And Ntr Recommend For Super Awards, Ntr And Ram Charan Nominated Critics Choice Super Awards, Ntr Suggest For Critics Choice Super Awards , Ram Charan Critics Choice Super

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ తో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చూపించాడు. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తరువాత ఈసినిమా గతేడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భాషతో సంబంధం లేకుండా రిలీజ్ అయిన అన్ని భాషల్లో ఈసినిమా కోట్లు రాబట్టుకుంది. ఇక ఈసినిమా ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టుకున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ కి సంబంధించిన సాటర్న్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును సొంతం చేసుకుంది. ఆతరువాత సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాగా నిలిచింది. రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్.. నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా మరో అంతర్జాతీయ అవార్డ్ కేటగిరీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నామినేట్ అయ్యారు. క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డుల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ కేటగిరిలో నామినేషన్స్ లో నిలిచారు. ఈ నామినేషన్ల్ లో హాలీవుడ్ దిగ్గజ నటులైన టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్, నికోలస్ కేజ్ వంటి వారితో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా స్థానం దక్కించుకోవడం గొప్ప విషయమే అని చెప్పాలి. కాగా ఈ అవార్డుల ఫలితాలు మార్చి 16న వెల్లడిస్తారు.

ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 17 =