గుడ్ మార్నింగ్ అమెరికా టీవీ షో లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Global Star Ram Charan At Good Morning America Show,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Charan Upcoming Movie,Ram Charan Latest Movie,Ram Charan Updates,Ram Charan Latest Movie News,Rrr Ram Charan Movie Newsram Charan,Ram Charan At Good Morning America Show,Mega Powerstar Ram Charan Good Morning America Show,In America Show Ram Charan, America Show Talk Ram Charan, Talk About Rrr Movie With Ram Charan In Good Morning America Show

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్స్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో రామ్ చరణ్ ఓ ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నారు. ఈ నెల 24న అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఈ ఈవెంట్ కోసం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యుఎస్ఏ బయల్దేరి వెళ్లారు. హీరో రామ్ చరణ్ కు అమెరికాలో మన భారతీయలతో పాటు విదేశీ అభిమానులు కూడా ఘనస్వాగతం పలికారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ప్రస్తుతం ఇంటర్నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ మరో రేర్ ఫీట్‌ను అందుకున్నారు. అమెరికాలో ఎంతో ఫేమస్ అయిన గుడ్ మార్నింగ్ అమెరికా అనే షోలో రామ్ చరణ్‌ సందడి చేస్తున్నారు. టామ్ క్రూజ్, లియోనార్డ్ డికాప్రియో వంటి హీరోలు వెళ్లిన ఈ షోకు ఇప్పుడు మన రామ్ చరణ్‌ వెళ్ళారు. ఇంత వరకు ఈ షోకు మన ఇండియా నుంచి ఏ హీరో కూడా వెళ్లలేదు. అది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ అంటూ మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.