నాగార్జున సినిమాపై నరేష్ క్లారిటీ

Allari Naresh Clarity About The Role In Nagarjuna Movie,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Nagarjuna Upcoming Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Updates,Nagarjuna Latest Movie News,Nagarjuna,Allari Naresh,Allari Naresh Talk About Nagarjuna Movie, Allari Naresh Revels About Nagarjuna Movie,Allari Naresh Clarity About The Role Nagarjuna Latest Movie,Allari Naresh Talk About The Role Nagarjuna Movie

ప్రస్తుతం అల్లరి నరేష్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇటీవలే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లరి నరేష్ ఇప్పుడు ఉగ్రం సినిమాతో రాబోతున్నాడు. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో నరేష్ హీరోగా ఈసినిమా వస్తుంది. ‘నాంది’ వంటి సూపర్ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే నిన్న ఈసనిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ మాత్రం సినిమాపై ఆసక్తిని పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా నాగార్జున కొత్త సినిమాలో అల్లరి నరేష్ నటిస్తున్నాడన్న వార్తలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా వాటిపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు నరేష్. ఈసినిమా మేకర్స్ నన్ను అప్రోచ్ అయ్యారు అది నిజమే.. ప్రస్తుతం అయితే కథ వరకూ విన్నాను ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు.. ఒకసారి నేను ఓకే చెబితే మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారు అని తెలియచేశాడు.

ఉగ్రం సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మాట‌లు అబ్బూరి ర‌వి అందిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − three =