పులి-మేక ట్రైలర్ రిలీజ్

Puli Meka Web Series Trailer Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Puli Meka,Puli Meka Web Series,Puli Meka Telugu Web Series,Puli Meka Update,Puli Meka Updates,Puli Meka Latest Update,Puli Meka Latest Updates,Aadi,Aadi Movies,Aadi New Movie,Aadi Latest Movie,Aadi Upcoming Movie,Aadi Puli Meka,Aadi Puli Meka Movie,Puli Meka Trailer,Puli Meka Web Series Trailer,Ram Charan,Puli Meka Web Series Update,Puli Meka Web Series Trailer Update,Aadi Saikumar,Aadi Saikumar New Webseries,Puli Meka On Zee5,Lavanya,Puli-Meka Trailer,Puli Meka Telugu Trailer,Puli Meka Telugu Web Series Trailer,Puli Meka Web Series Trailer Released,Puli Meka Trailer,PULIMEKA Official Tralier,ZEE5,Aadi,Lavanya,Kona Venkat,Puli Meka Premeires 24th Feb,Puli Meka Web Series Official Trailer

ఓటీటీల హవా పెరిగిన తరువాత వెబ్ సిరీస్ ల రేంజ్ ఎంత పెరిగిందో చూస్తున్నాం. అందుకే చిన్న హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకూ అందరూ వెబ్ సిరీస్ లలో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నాడు. ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో వస్తున్న వెబ్ సిరీస్ పులి-మేక. ఇక ఈసిరీస్ జీ5 లో 24వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గానే ఈసిరీస్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు ట్రైలర్ కూడా సిరీస్ పై మరింత ఆసక్తిని పెంచింది. పోలీస్ ఆఫీసర్లను మాత్రమే టార్గెట్ చేసి చంపే సైకో కిల్లర్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని ట్రైలర్ ను బట్టి అర్థమవుతుంది. అయితే మధ్యలో పోలీసులను మాత్రమే కాకుండా సామాన్యులను కూడా చంపడంతో స్టోరీ ఇంట్రస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. ఈ కేసును డీల్ చేసే ఆఫీసర్‌గా లావణ్య త్రిపాఠి కనిపించనుండగా, తనకు సాయపడే మరో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో ఆది సాయికుమార్ నటించారు. సిరీస్ లో ట్విస్ట్ లు, యాక్షన్ సన్నివేశాలు అన్నీ ఉండటంతో అంచనాలు బాగానే పెరిగాయి.

కాగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈవెబ్ సిరీస్ కు కె.చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తుండగా ఈసిరీస్ కు స్టార్ రైటర్ కోన కథను అందించారు. ఇంకా ఈవెబ్ సిరీస్ లో పాటు సుమన్, సిరి హనుమంతు, ముక్కు అవినాష్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. మరి జీ5 నుండి ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లు వచ్చి స్ట్రీమింగ్ అయ్యాయి. దీంతో ఈవెబ్ సిరీస్ పై కూడా అంచనాలు ఏర్పడ్డాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =