రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఫిక్షన్ నేపథ్యంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామ రాజు కలిసి చేసే పోరాటం నేపథ్యంలో ఈసినిమాను తెరెకక్కించాడు రాజమౌళి. ఇక ఈసినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహాన్ని చాాలా చక్కగా చూపించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు రాజమౌళి. అయితే సినిమాలో కంటే ముందో ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తమ ఫ్రెండ్షిప్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు రామ్ చరణ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ కి ముందు నుండి మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆర్ఆర్ఆర్ సినిమా అనేది మా ఫ్రెండ్ షిప్ ను ప్రపంచానికి వెల్లడించడానికి మీడియం అయ్యింది. అయితే సినిమాల్లో కాంపిటీషన్ విషయానికి వస్తే, కచ్చితంగా ఉండేది. కాకపోతే అది హెల్దీ కాంపిటీషన్ అంటూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్.
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: