పాప్ కార్న్ (2016 ) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన సంయుక్త పలు మలయాళ, తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ భీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన సంయుక్త బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. గాలిపటం2 మూవీతో సంయుక్త శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన సార్ మూవీ ఫిబ్రవరి 17 వ తేదీ రిలీజ్ కానుంది. విరూపాక్ష (తెలుగు ), బూమెరాంగ్ మలయాళ మూవీలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా సంయుక్త ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ …తాను నటించే ప్రతి పాత్రని అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని నటిస్తాననీ.. ఒక్కో పాత్రకి ఒక్కో విధానంగా వెళతాననీ.. కానీ స్పాంటేనియస్ గా చెయ్యడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాననీ అంటోంది. అదీ కాకుండా ఆ పాత్రని దర్శకుడు, రచయిత ఆలోచనలోంచి వస్తుంది కాబట్టి.. వాళ్ళు అనుకునే విధంగా చెయ్యడానికి చూసినప్పుడే బెస్ట్ యాక్టింగ్ వస్తుందనీ.. ఒక్కో పాత్ర ఒక్కోలా ఉంటుందనీ.. విరూపాక్ష సినిమాలో కొంచెం గ్రామీణ ప్రాంతానికి చెందిన నేపధ్యం ఉంటుందనీ.. .హైదరాబాద్ లో ఉంటున్నా కదా అందుకని తెలంగాణ, ఆంధ్ర లో కొన్ని గ్రామాలని సందర్శించి గ్రామాలు ఎలా వుంటాయో తెలుసుకున్నాననీ.. సార్ సినిమాలో ఉపాధ్యాయిని రోల్ కాబట్టి, తాను చదివినప్పుడు ఉపాధ్యాయులు ఎలా ఉండేవారు, వాళ్ళు ఎలాంటి బట్టలు కట్టుకొని వచ్చేవారు, వాళ్ళు ఎలా మాట్లాడేవారు, వాళ్ళ హావభావాలు అన్నీ గుర్తుకు తెచ్చుకున్నాననీ.. టాలీవుడ్ కు వచ్చిన తరువాతే తన దశ తిరిగిందనీ.. పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నాననీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: