విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక జానర్ లో సుమారు 300 సినిమాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. నటుడు, నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధినేతగా ఎన్టీఆర్ కళామ తల్లికి సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా ఎన్టీఆర్ ప్రజలకు మేలు కలిగేలా పలు పథకాలు ప్రవేశపెట్టారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సుమారు 255 సినిమాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఏఎన్ఆర్ తన సినీ కెరీర్ లో సింహ భాగం సాంఘిక చిత్రాలలోనే నటించారు. ప్రేమ కధలకు ఏఎన్ఆర్ పెట్టింది పేరుగా మారారు. నటుడు, నిర్మాత, స్టూడియో అధినేతగా కళామ తల్లికి సేవలందించిన ఏఎన్ఆర్ భారతదేశ అత్యున్నత పురస్కారాలు పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లను అందుకున్నారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, విశ్వనట చక్రవర్తి ఎస్ వి రంగారావు తెలుగు, తమిళ భాషలలో సుమారు 160 సినిమాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. దుర్యోధనుడు, యముడు, రావణుడు, కీచకుడు, హిరణ్య కశిపుడు వంటి పాత్రలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎస్విఆర్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
— chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023
లెజెండరీ యాక్టర్స్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్విఆర్ లు చిత్ర పరిశ్రమ ఉన్నంతవరకూ ప్రేక్షకుల హృదయాలలో నిలిచే ఉంటారు. వారిని ఎవరైనా గౌరవించాల్సిందే అని నాగచైతన్య, అఖిల్ అక్కినేని సోషల్ మీడియా లో పోస్ట్స్ పెట్టారు. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలనీ, వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం అంటూ నాగ చైతన్య, అఖిల్ ట్వీట్స్ చేశారు .
— Akhil Akkineni (@AkhilAkkineni8) January 24, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.