భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్రిపరేషన్ లో ఎన్టీఆర్ 30

NTR30 Movie Team Preparation on for High Octane Action Sequence,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,NTR30,NTR30 Movie,NTR30 Movie Latest News,NTR30 Movie News,Jr NTR,NTR30 Movie Team,NTR30 Telugu Movie Team

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30 వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. అయినా కూడా ఈసినిమా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే ఈసినిమా షూటింగ్ ను ఫిబ్రవరి నుండి మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి సినిమాకు సంబంధించిన ప్రిపరేషన్స్ లో ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమాకు సంబంధించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్రిపరేషన్ లో ఉన్నారట. స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే హీరోయిన్ అలానే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. అయితే జాన్వీ కపూర్ ను ఈసినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేయనన్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నట్టు తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 8 =