ప్రస్తుతం ఉన్న సినీ పరిశ్రమల్లో చాలా మార్పులు వచ్చాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొత్తగా ప్రయత్నిస్తున్నారు. హీరోలు నిర్మాతలుగా మారుతున్నారు. కొంతమంది డైరెక్టర్లు హీరోలుగా మారి సినిమాలు తీస్తున్నారు.. అలాగే కొంత మంది నిర్మాతలుగా మారుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది డైరెక్టర్లు ఒక పక్క తమ సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతలుగా యంగ్ హీరోలు, అప్ కమింగ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈలిస్ట్ లో ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి కూడా చేరిపోయాడు. రెండో సినిమాగా శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా మహాసముద్రం అనే సినిమాను తీశాడు. అయితే ఈసినిమా మంచి విజయాన్నిఅయితే అందించలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు అజయ్ తన మూడో సినిమాకు సన్నద్దమవుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను కూడా రస్టిక్ అండ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి కూడా. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాతో అజయ్ భూపతి నిర్మాతగా కూడా మారుతున్న సంగతి విదితమే. ఇటీవలే తన ప్రొడక్షన్ హౌస్ ను లాంచ్ చేశారు. దానికి ఏ క్రియేటివ్ వర్క్ అనే పేరు పెట్టారు. ఇక నేడు ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. తన మూడో సినిమాకు సంగీత దర్శకుడిగా కాంతార సెన్సేషన్ అజనీష్ లోక్ నాథ్ ను తీసుకున్నాడు. ఈవిషయాన్ని అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ మరీ తెలిపారు. ఈసినిమా టైటిల్ ఇంకా ఇతర వివరాలను త్వరలో తెలియచేయనున్నట్టు పేర్కొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: