మైఖేల్-మ్యాడ్ క్వీన్ గా అనసూయ

Anasuya Role Revealed From Sundeep Kishan Michael Movie, Anasuya Role Revealed From Michael Movie, Sundeep Kishan Michael Movie, Anasuya Role, Vijay Sethupathi, Varalaxmi Sarathkumar, Gautham Vasudev Menon, Sundeep Kishan, Varun Sandesh, Anasuya, Divyansha Kaushik, Ranjit Jeyakodi, Sundeep Kishan Movies, Sundeep Kishan Latest Movie, Sundeep Kishan Upcoming Movie, Michael, Michael 2023, Michael Movie, Michael Update, Michael Latest News, Michael Telugu Movie, Michael Movie Live Updates, Michael Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అయినా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని మైఖేల్‌ వంటి పాన్‌ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు సందీప్ కిషన్. డైరెక్టర్ రంజిత్ జయకోడి దర్శకత్వంలో  భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో సందీప్ కిషన్ కొత్త మేకోవర్ తో అలరించనున్నాడు. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈసినిమా ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇప్పటికే పలు పోస్టర్లు అలానే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈసినిమాలో అనసూయ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన పాత్రను రివీల్ చేశారు మేకర్స్. ఈసినిమాలో అనసూయ మ్యాడ్ క్వీన్ చారులత పాత్రలో నటిస్తున్నట్టు చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో దివ్యాంశ కౌశిక్ సందీప్ కు జోడీగా హీరోయిన్ గా నటిస్తుంది. విజ‌య్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడం విశేషం. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =