ఇప్పటికీ హౌస్ ఫుల్ గా ధమాకా

Ravi Teja Dhamaka Movie Shows Housefull Boards Still, Dhamaka Movie Shows Housefull Boards Still, Ravi Teja Dhamaka Movie, Ravi Teja, Sreeleela, Jayaram, Rao Ramesh, Tanikella Bharani, Trinadha Rao Nakkina, Ravi Teja Movies, Ravi Teja Latest Movie, Ravi Teja Upcoming Movie, Dhamaka, Dhamaka 2022, Dhamaka Movie, Dhamaka Update, Dhamaka Latest News, Dhamaka Telugu Movie, Dhamaka Movie Live Updates, Dhamaka Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

ప్రస్తుతం ఒక సినిమా థియేటర్లలో గట్టిగా పదిరోజులు ఆడటమే కష్టంగా మారింది. ఒకప్పుడు 100 రోజులు, 150 రోజులు, 365 రోజులు ఈ రేంజ్ లో సినిమాలు థియేటర్లలో సందడి చేసేవి. ప్రేక్షకులు కూడా ఎన్నిసార్లు అయినా థియేటర్లలో చూడటానికి వచ్చేవారు. అయితే ఇప్పుడు ఓటీటీలు రావడం వల్ల పరిస్థితి మారింది అనుకోండి. ఇప్పుడు రెండు వారాలు, 50 రోజులు ఆడితేనే గొప్పగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈనేపథ్యంలో ధమాకా సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన సినిమా ధమాకా. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజా సమాచారం ప్రకారం ఈసినిమా ఇప్పటికీ కొన్నిచోట్ల హౌస్ ఫుల్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా డిసెంబర్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు సంక్రాంతి వచ్చేసింది. పెద్ద పెద్ద సినిమాలు చాలా రిలీజ్ అయ్యాయి. అయితే సంక్రాంతికి ఇన్ని సినిమాలు ఉన్నప్పటికీ కూడా ధమాకా ఇంకా హౌస్ ఫుల్ ను సొంతం చేసుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ధమాకా కొన్ని థియేటర్స్ లోనే రన్ అవుతుంది… అయినప్పటికీ వాటిలో హౌస్ ఫుల్స్ పడ్డాయని తెలుస్తుంది.

కాగా ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా.. సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, జయరామ్, తనికెళ్ల భరణి, సీత, పవిత్ర లోకేష్, సమీర్, ప్రవీణ్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు కార్తీక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + thirteen =