త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన సినిమా ధమాకా. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. రవితేజ, శ్రీలీల ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇంకా ఈ సినిమాలో బీమ్స్ సిసిరోలియో సంగీతం కూడా ఈసినిమా సక్సెస్ లో ముఖ్య భూమిక పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బీమ్స్ అందించిన పాటలు ఆ పాటలకు రవితేజ, శ్రీలీలలు వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు సినిమా విజయానికి తోడ్పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇన్ని రోజులు థియేటర్లలో సందడి చేసిన ఈసినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో ఈసినిమా స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఈసినిమాను జనవరి 22వ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయోచ్చు..
కాగా ఈసినిమాలో సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, జయరామ్, తనికెళ్ల భరణి, సీత, పవిత్ర లోకేష్, సమీర్, ప్రవీణ్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు కార్తీక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: