తమిళ్ స్టార్ హీరో అజిత్ ప్రధాన పాత్రలో, హెచ్ వినోద్ దర్శకత్వంలో వస్తున్న సినిమా తునివు. నెర్కొండ పార్వాయి, వాలిమై సినిమాల తరువాత వస్తున్న సినిమా ఇది. తెలుగులో తెగింపు అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన పోస్టర్లు, టీజర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. అజిత్, మంజు వారియర్, సముద్రఖని, పావని రెడ్డి, వీర, భగవతి పెరుమాళ్, అజయ్, ప్రేమ కుమార్ తదితరులు
దర్శకత్వం.. హెచ్ వినోద్
బ్యానర్స్.. బేవ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్
నిర్మాతలు.. బోనీ కపూర్
సంగీతం.. గిబ్రాన్
సినిమాటోగ్రఫి.. నిరావ్ షా
కథ
యువర్ బ్యాంక్ అధినేత క్రిష్ (జాన్ కొక్కెన్). అయితే ఆ బ్యాంక్ లో ఉన్న డబ్బును కొంతమందితో కలిసి కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. ప్లాన్ ప్రకారం బ్యాంక్ లోకి వెళతారు. అయితే వారి కంటే ముందే ఆ బ్యాంక్‌లోకి ఎంటర్ అయిన ఇంటర్‌నేషనల్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ డార్క్ డెవిల్ (అజిత్) ఆ బ్యాంక్‌ను హైజాక్ చేస్తాడు. డార్క్ డెవిల్ అండ్ గ్యాంగ్ చేసిన పక్కా ప్లాన్ వలన పోలీసులు బ్యాంకు లోపలికి ఎంటర్ కాలేకపోతారు. మరి డార్క్ డెవిల్ఆ బ్యాంక్‌ను ఎందుకు హైజాక్ చేయాలని అనుకున్నాడు? ప్రజలను మోసం చేసి అక్రమంగా డబ్బును కూడబెట్టిన క్రిష్ తో అతడి టీమ్ మోసాన్ని డార్క్ డెవిల్ ఎలా బయటపెట్టాడు. ఈ ప్లాన్‌లో డార్క్ డెవిల్‌కు సాయం చేసిన రమణి(మంజు వారియర్) ఎవరు అన్నదే ఈ సినిమా కథ.
విశ్లేషణ..
బ్యాంకు రాబరీలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈసినిమా కూడా అలాంటి నేపథ్యంలో వచ్చిన సినిమానే. అంతేకాదు ఈమధ్య సినిమాలు ఇన్నిడెంట్ తో తెరకెక్కుతుండటం చూస్తున్నాం. ఈసినిమా కథ కూడా దాదాపు బ్యాంకులోనే నడుస్తుంది. బ్యాంకుల్లో జరిగే కొన్ని మోసాలను ఈసినిమా ద్వారా తెలియచేశారు. మ్యూచ్‌వల్ ఫండ్స్, ఇతర ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ పేరుతో ఫేక్ గ్యారెంటీలు ఇస్తూ కొన్ని బ్యాంకులు ప్రజలను ఎలా మోసం చేస్తున్నాయి? దివాళా పేరుతో బ్యాంకులను మూసివేస్తూ సామాన్యుల కష్టార్జితాన్నిఏ విధంగా దోచుకుంటున్నారో ఈ సినిమాలో చర్చించారు. అయితే సోషల్ మెసేజ్ కథకి యాక్షన్ ఎపిసోడ్ జోడించారు. అక్కడక్కడ సినిమాలో వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగానే అలరిస్తాయి. ముఖ్యంగా గుండాలకి మరియు అజిత్ కి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి.
తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తమిళ్ హీరోలలో అజిత్ కూడా ఒకరు. చాలా వరకు అజిత్ డబ్బింగ్ సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా ఇప్పుడు అజిత్ హీరోగా “తునివు” అనే సినిమా తెలుగులో “తెగింపు” అనే టైటిల్ తో విడుదలైంది. ఇక అజిత్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఇలాంటి పాత్రలు కూడా అజిత్ కు కొత్తేమీ కాదు. అందుకే ఈసినిమాలో కూడా ఎప్పటిలాగే తన స్టైలిష్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. అతని మ్యానరిజమ్స్, మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. మంజు వారియర్ కూడా తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేసింది. సముద్రఖని నటన కూడా ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాగా నటించారు. అజయ్ కు కూడా చాలా కాలం తర్వాత ఈ సినిమాలో ఒక మంచి పాత్ర దక్కింది తన పాత్ర పరిధి మేరకు అజయ్ కూడా బాగానే నటించాడు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
టెక్నికల్ వాల్యూస్
ఇక సాంకేతిక విభాగానికి వస్తే జిబ్రాన్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈసినిమాకు మంచి ప్లస్ పాయింట్ అయింది. సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకి మంచి బ్రైట్ విజువల్స్ ను అందించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రొడ్యుసర్‌గా బోనీ కపూర్ ఖర్చుకి వెనకాడలేదు. అది ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.
ఓవరాల్ గా చెప్పాలంటే యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ లను ఇష్టపడేవాళ్లకు ఈసినిమా నచ్చుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: