మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగాఈ రోజు ( జనవరి 12 వ తేదీ) గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. శృతి హాసన్ కథానాయిక. ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. బ్లాక్ బస్టర్ అఖండ మూవీ తరువాత బాలయ్య నటించిన సినిమా కావడం, బ్లాక్ బస్టర్ క్రాక్ మూవీ తరువాత గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో వీరసింహారెడ్డి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో సందడి చేశారు. నందమూరి నటసింహం నటించిన వీరసింహా రెడ్డి సినిమా ఉదయపు ఆటతో తెలుగు రాష్ట్రాలలో విడుదలైంది. ఈ సందర్భంగా కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించడానికి బాలకృష్ణ ఆయన అక్కడికి చేరుకున్నారు. బాలయ్య ప్రేక్షక , అభిమానులతో ఆ థియేటర్ నిండిపోయింది. జై బాలయ్య నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. డప్పులు, బ్యాండ్‌బాజాలతో తమ అభిమానహీరోకు ప్రేక్షకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రేక్షకుల, అభిమానులతో కలిసి సినిమా వీక్షించడం సంతోషంగా ఉందనీ , వారి స్పందన బాగుందనీ బాలకృష్ణ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























