పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతి శెట్టి జంటగా తెలుగు, తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో కస్టడీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నాగచైతన్య బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్ లో మొదలైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ నిన్న మొదలయింది. ఈ షెడ్యూల్ తో ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ చేసుకోనుండగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకోడానికి దాదాపు మూడు నెలలు పాటు మేకర్స్ సమయం తీసుకుంటున్నారు. సూపర్ హిట్ బంగార్రాజు మూవీలో నాగచైతన్య, కృతి శెట్టి తమ అద్భుతమైన స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కస్టడీ మూవీతో మరోసారి అలరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: