ప్రస్తుతం కన్నడ పరిశ్రమ మంచి బూమ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఎంత మంచి సినిమా వచ్చినా కన్నడ ప్రేక్షకులకు తప్పా పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. అయితే కె.జి.యఫ్ తరువాత కన్నడ పరిశ్రమ రేంజ్ మారిపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఇక పార్ట్ 1 విజయంతో దానికి సీక్వెలన్ కూడా తీసి గతఏడాది రిలీజ్ చేశారు అది కూడా ఘన విజయం సాధించింది. ఒకరకంగా చెప్పాలంటే కె.జి.యఫ్ తరువాత కన్నడ సినిమాలకు మంచి డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. అలాంటి సినిమాపై అదే పరిశ్రమకు చెందిన నటుడు షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ నటుడు ఎవరో కాదు కాంతార సినిమాలో పోలీసు పాత్రలో నటించిన కిషోర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గన్న కిషోర్ తాను ఇంతవరకూ కె.జి.యఫ్ 2 చూడలేదని.. ఇది నా తరహా సినిమా కాదు.. అది తన వ్యక్తిగత ఛాయిస్ అని చెప్పాడు. అక్కడితో ఆగకుండా నేను మైండ్‌లెస్ మూవీ కంటే కూడా కంటెంట్ కలిగి విజయం సాధించని చిన్న సినిమాని చూడాలనుకుంటాను’ అని చెప్పుకొచ్చాడు. దీంతో కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి కె.జి.యఫ్ టీమ్ కిషోర్ వ్యాఖ్యలను లైట్ తీసుకుంటుందా.. లేకపోతే కౌంటర్ ఏమైనా ఇస్తారా అన్నది చూడాలి..
కాగా రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతార సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో చూశాం. ఈసినిమాలో రిషబ్ శెట్టి హీరోగా చేయడమే కాదు.. దర్శకత్వం కూడా వహించడం విశేషం. ఈసినిమాలో తన స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ స్కిల్స్‌తో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నాడు కిషోర్. ఇంకా ఈసినిమాలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమీ గౌడ తదితరులు నటించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించారు. అజిత్ లోక్ నాథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫి, ప్రతీక్ శెట్టి ఈసినిమాకు ఎడిటర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: