శాకుంతలం నటుడు- తెలుగులో ఇంకా సినిమాలు చేయాలి

Dev Mohan Wants To Be Part Of More Telugu Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dev Mohan,Dev Mohan Movies,Dev Mohan New Movie,Dev Mohan Latest Movie,Dev Mohan Upcoming Movie,Dev Mohan New Movie Update,Dev Mohan Latest Movie Update,Dev Mohan Latest News,Dev Mohan Latest Film Update,Dev Mohan Latest News,Dev Mohan Wants Part Of More Telugu Movies,Dev Mohan About Telugu Movies,Dev Mohan Telugu Movies,Dev Mohan Latest Telugu Movies,Dev Mohan New Telugu Movies,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Dev Mohan Shaakuntalam,Dev Mohan Shaakuntalam Movie

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ఈసినిమా కోసం సినీ ప్రేక్షకులతో పాటు సమంత అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్ప‌టికే ఈసినిమా నుండి విడుదలైన స‌మంత ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ కానీ, దేవ్ మోహన్ పోస్టర్ కానీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను న్యూ ఇయర్ సందర్భంగా ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 17వ తేదీన ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాలో మేల్ లీడ్ లో నటించిన దేవ్ మోహన్ ఈసినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ అవుతుందని అంటున్నాడు. అంతేకాదు మలయాళంలో సినిమాలు చేస్తున్నా కూడా ఫ్యూచర్ లో తాను ఇంకా తెలుగు సినిమాల్లో భాగం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. మరి చూద్దాం దేవ్ కోరిక మేరకు శాకుంతలం సినిమా తరువాత తెలుగులో తనకు అవకాశాలు వస్తాయోమో..

కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 17 =