టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమా మైఖేల్. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో సందీప్ కిషన్ కొత్త మేకోవర్ తో అలరించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే రిలీజైన సందీప్ పోస్టర్లకు అలాగే టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమాను ఫిబ్రవరి 3వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తాజాగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Get ready for the #MICHAEL mayhem in cinemas 😎
WW Grand Release in Theatres on Feb 3rd, 2023 🔥#MichaelfromFEB3rd 👊🏾@sundeepkishan @VijaySethuOffl @Divyanshaaaaaa @menongautham @anusuyakhasba @jeranjit @itsvarunsandesh @SamCSmusic @SVCLLP @KaranCoffl #NarayandasNarang pic.twitter.com/HdaO6kKHj1
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) January 3, 2023
కాగా ఈసినిమాలో దివ్యాంశ కౌశిక్ సందీప్ కు జోడీగా హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడం విశేషం. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























