కొత్త కొత్త సినిమాల అప్ డేట్లు… రిలీజ్ కాబోతున్న సినిమాల అప్ డేట్లు అన్నీ ఒకదాని తరువాత ఒకటి వస్తున్నాయి. ఈనేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా అప్ డేట్ గురించి. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి పవన్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న టీజర్ ను ఈ నెల 26న హరిహర వీరమల్లు నుండి టీజర్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
కాగా ఈసినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాలో ఒక కీలక పాత్రకోసం బాబీ డియోల్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది.
ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: