మాస్ మహారాజా రవితేజకు 2022 ఎండింగ్ మాత్రం మంచి గుర్తుండిపోయే గిఫ్ట్ ను ఇచ్చింది. గత ఏడాది అతడు ముందుగా ‘ఖిలాడి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ కూడా సరిగా ఆడలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో రవితేజ ‘ధమాకా’ సినిమా చేశాడు. ఈసినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకొని రవితేజకు ఊరట నిచ్చింది. ఈసినిమాలో పాటలు, మాటలు, రవితేజ నటన, శ్రీలీల ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ఇలా అన్ని అంశాలు మాస్ అడియన్స్ ను కట్టిపడేశాయి. డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో రిలీజ్ అయిన ఈసినిమా అదే ఇంపాక్ట్ ను చూపిస్తుంది థియేటర్స్ లలో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక డిసెంబర్ 23వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా 10 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఈ 10 రోజుల్లో ఎక్కడా తగ్గకుండా రోజు రోజుక కలెక్షన్స్ ను పెంచుకుంటూనే ఉంది ఈసినిమా. ఈసినిమా వంద కోట్ల కలెక్షన్ దిశగా పరుగెడుతోంది. దాంతో ధమాకా పరుగు ఆగడంఇక 10 రోజుల్లో ఈసినిమా 89 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ కూడా అధికారికంగా తెలియచేసింది. ఇక మరో సంక్రాంతి వరకూ సరైన సినిమా లేదు.. ఇక ఈపదిరోజుల్లో ఈసినిమా మరింత కలెక్షన్స్ రాబట్టుకోవడం గ్యారెంటీ అంటున్నారు.
MassMaharaja @RaviTeja_offl ‘s
MASSive 1️⃣0️⃣ Days
UnStoppable Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#DhamakaBook your tickets nowhttps://t.co/iZ40p9utmY@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/dBcLuhlOlj
— People Media Factory (@peoplemediafcy) January 2, 2023
కాగా ఈసినిమాలో సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, జయరామ్, తనికెళ్ల భరణి, సీత, పవిత్ర లోకేష్, సమీర్, ప్రవీణ్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు కార్తీక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























