నాని ప్రస్తుతం చేస్తున్న సినిమా దసరా. ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. సింగరేణి గోదావరిఖని గనుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఫుల్ రఫ్ అండ్ రస్టిక్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నాని 30 వ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. న్యూఇయర్ సందర్భంగా ఈసినిమా వివరాలు తెలియచేయనున్నామని తెలిపారు. ఈనేపథ్యంలోనే నాని30 వరల్డ్ అంటూ ఒక వీడియోను విడుదల చేసారు. నాని ఒక భవనం పైన కూర్చుని ఫోటోలు క్లిక్ చేస్తూ ఉండగా.. డాడీ నీ గడ్డం నచ్చలేదంటోంది అతడి కూతురు. ఇది దసరా కోసం నాన్న అయిపోవచ్చింది. మన సినిమాకుండదని అంటాడు. మరి మీసం అంటే ఉండదు అని.. జుట్టు అని అడుగుతూనే ఉంచుదాం లే నాన్నా.. అంటుండగా నువ్వుంచుదామంటే ఉంచుదామని అంటాడు నాని. తండ్రీకూతుళ్ల రిలేషన్ షిప్ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ వీడియోతో అర్థమవుతుంది.
Here #Nani30 pic.twitter.com/FDPjVnStXB
— Nani (@NameisNani) January 1, 2023
ఇక ఈసినిమాలో నటించే హిరోయిన్, సాంకేతిక నిపుణుల వివరాలను తెలిపారు. ఈసినిమాలో సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.వి.మోహన్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: