న్యూ ఇయర్ ట్రీట్ కు రెడీగా స్టార్ హీరోలు?

Star Heroes Vijay And Ajith Movies Ready for New Year Treat,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay And Ajith Movies,Ajith Movies,Vijay Movies,Star Heroes Vijay And Ajith Movies

స్టార్ హీరోల సినిమాల మధ్య పోటీ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అది ఏ ఇండస్ట్రీ అయినా సరే పోటా పోటీ వాతావరణం ఖచ్చితంగా నెలకొంటుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ మధ్య ఆ పోటీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తమిళ్ స్టార్ హీరోలు అయిన విజయ్ అలానే అజిత్ మధ్య పోటీ అనేది ఎప్పటినుండో నడుస్తుంది. అప్పుడప్పుడు ఇద్దరి ఫ్యాన్స్ మధ్య వివాదాలు తలెత్తిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక మరోసారి వీరిద్దరూ ఒకేసారి బరిలోకి దిగుతుండటంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా వారిసు. తెలుగులో ఈసినిమా వారసుడు అనే టైటిల్ తో వస్తుంది. మొదటిసారి తెలుగు దర్శకుడితో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు అజిత్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో వస్తున్న సినిమా తునివు. తెలుగులో ఈ సినిమాకు తెగింపు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈసినిమా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా. దీంతో ఈసినిమా పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈరెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. ఈనేపథ్యంలో రెండు చిత్రాలు కూడా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఇప్పుడు ఈరెండు సినిమాల నుండి న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యాన్స్ కు ట్రీట్ రాబోతున్నట్టు తెలుస్తుంది.

తునివు ట్రైలర్ ను డిసెంబర్ 31న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా విజయ్ వారిసు థియేట్రికల్ ట్రైలర్ ని జనవరి 1న రిలీజ్ చేసేందుకు ఆ మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. మొత్తంగా 2023 న్యూ ఇయర్ సందర్భంగా అటు విజయ్, ఇటు అజిత్ ఫ్యాన్స్ కి ఇది సూపర్ ట్రీట్ అంటున్నారు. మరి దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + eight =