పవన్ తో సినిమాపై చిరు రియాక్షన్

megastar chiranjeevi clarity about working with pawan kalyan,Megastar Chiranjeevi Clarity About Working with Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Megastar Chiranjeevi,Megastar Chiranjeevi Latest News,Megastar Chiranjeevi Upcoming Movie With Pawan Kalyan,Chiranjeevi About Movie with Pawan Kalyan,Pawan Kalyan,Megastar Chiranjeevi,Chiranjeevi

రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చిరు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలను రిలీజ్ చేయగా.. వాటిలో గాడ్ ఫాదర్ సూపర్ హిట్ ను అందించింది. ఇక ఇప్పుడు అదే జోష్ తో వాల్తేరు వీరయ్యను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. సంక్రాంతి బరిలో దిగనున్న ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి వరుసగా పాటలు రిలీజ్ చేస్తుండగా వాటికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన ప్రత్యేక సెట్ లో వాల్తేరు వీరయ్య యూనిట్ మీడియా మీట్ జరిగింది. ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ.. అభిమానుల తో పాటు ఆడియన్స్ అందరూ నా నుండి కోరుకునే అన్ని అంశాలు బాబి ఈసినిమాలో పొందుపరిచాడని..యూనిట్ లో ప్రతి ఒక్కరు వాల్తేరు వీరయ్య కోసం ఎంతో కష్టపడ్డారని తెలిపాడు. ఈనేపథ్యంలోనే పవన్ తో సినిమా గురించి అడుగగా.. పవన్ కళ్యాణ్ తో తనకు కూడా వర్క్ చేయాలని ఎప్పటి నుండో ఆలోచన ఉందని అన్నారు.ప్రస్తుతం పవన్ కూడా వరుసగా ప్రాజక్ట్స్ తో బిజీగా ఉండడం వలన అది మరొక రెండేళ్ల అనంతరం జరిగే అవకాశం ఉందని, అయితే పక్కాగా తామిద్దరికి తగ్గ విధంగా మంచి స్క్రిప్ట్ సిద్ధం చేసి ఎవరైనా దర్శకుడు తీసుకువస్తే యాక్ట్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. అభిమానులు కూడా ఎప్పటినుండో తామిద్దరి కాంబో మూవీ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. చూద్దాం మరి ఈ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + six =