టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు డబ్బింగ్ చెప్పేది ఎవరంటే వెంటనే చిన్మయి అని చెప్పేస్తాం. చిన్మయి వాయిస్ సమంత కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అందుకే సమంత కూడా తన అన్ని సినిమాలకు చిన్మయితోనే డబ్బింగ్ చెప్పించుకుంటుంది. ఇక అలా వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈనేపథ్యంలోనే ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒకరికి ఒకరు సపోర్ట్ గా నిలిస్తుంటారు. ఇక చిన్మయి భర్త కూడా రాహుల్ రవీంద్రన్ సమంతకు మంచి స్నేహితుడు. దీనిలో భాంగానే ఇప్పుడు రాహుల్ సమంతకు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా సమంతకు క్రిస్మస్ శుభాకాంక్షలు అందించాడు రాహుల్ రవీంద్రన్. ఇక ఈ పోస్ట్ లో రాహుల్ సమంత గురించి.. ప్రస్తుతం నీ మార్గం చీకటిగా ఉండొచ్చు. కనుచూపు మేరలో వెలుతురు ఆనవాళ్లు లేకపోవచ్చు. అయినప్పటికీ నీకున్న శక్తితో నువ్వు ముందుకు సాగగలవు.. నువ్వు ఉక్కు మహిళవి, విజయం నీ జన్మహక్కు.. నువ్వొక యోధురాలివి, నిన్ను ఏదీ ఓడించలేదన్నారు. ఇలాంటివి నిన్ను ఇంకా బలపడేలా చేస్తాయని, ఎప్పటికీ బలంగా ఉండేలా చేస్తాయని పోస్ట్ లో పేర్కొన్నాడు. ఇక దీనికి సమంత స్పందిస్తూ.. కఠినమైన పోరాటాలు చేస్తున్న వారికి ఇది అంకితమని, పోరాడుతూనే ఉంటే గతంలో కంటే బలంగా తయారవుతారని తెలిపింది.
Thankyou @23_rahulr 🫶🏻
To those of you fighting hard battles, this one’s for you as well. Keep fighting… we’ll be stronger than ever… and stronger forever soon💪🏼 pic.twitter.com/NWdrLAMIQ3— Samantha (@Samanthaprabhu2) December 25, 2022
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దానికి పైగా తన సినిమాలతో అలరిస్తూ వస్తుంది సమంత. ఇక రీసెంట్ గా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం తర్వాత వచ్చిన ఈ చిత్రం సాలిడ్ వసూళ్లు అందుకోవడమే కాకుండా సమంత కెరీర్ లో భారీ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం గుణశేఖర్ తో చేసిన శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇంకా విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా చేస్తుంది. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: