మరికొద్ది రోజుల్లో 2022 ముగిసిపోనుంది.. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనున్నాం. ఇక ఈ ఏడాది కూడా ఎన్నో సినిమాలు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. 2020 లో అప్పుడే కరోనా ప్రభావం మొదలవ్వడం.. ఆ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉండటంతో లాక్ డౌల్ ల వల్ల ఆ ఏడాది సినిమాలు రిలీజ్ కాలేకపోయాయి. గత ఏడాది కూడా అదే పరిస్థితి అయితే పరిస్థితికాస్త మెరుగుపడటంతో చాలా తక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ రెండేళ్లలో పెండింగ్ లో ఉన్న సినిమాలతో పాటు పలు కొత్త సినిమాలు కూడా ఈ ఏడాదే రిలీజ్ అయ్యాను. మరి ఈ ఏడాది బెస్ట్ హీరో ఎవరో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహేష్ బాబు – సర్కారు వారిపాట
మహేష్ బాబు హీరోగా ఈఏడాది వచ్చిన సినిమా సర్కారు వారి పాట. సరిలేరు మీ కెవ్వరు సినిమా తరువాత దాదాపు రెండేళ్లకు వచ్చిన సినిమా ఇది. ఈసినిమాకు కూడా కరోనా వల్ల పలు బ్రేకులు పడ్డాయి. ఇక ఫైనల్ గా ఈసినిమా ఈఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పరుశురాం దర్శకత్వలో బ్యాంకుల కుంభకోణంలో వచ్చిన ఈసినిమాలో మహేష్ తన కొత్త మేకోవర్ తో అలానే కామెడీ యాంగిల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఎన్టీఆర్ – ఆర్ఆర్ఆర్
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో నటించాడు. ఇక ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటిస్తాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాలో కూడా ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించి ప్రశంసలు దక్కించుకున్నాడు.
రామ్ చరణ్ – ఆర్ఆర్ఆర్
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈసినిమాలో అల్లూరి సీతరామరాజుగా నటించిన రామ్ చరణ్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక్కడ మాత్రమే కాదు ఈసినిమాతో దేశవ్యాప్తంగా కూడా రామ్ చరణ్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.
అడివి శేష్ – మేజర్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను చేసే సినిమాల్లో కంటెంట్ ఉంటుంది కాబట్టే వరుసగా విజయాలు అందుకుంటూ వెళుతున్నాడు. ఇక ఈఏడాది అడివి శేష్ నుండి వచ్చిన సినిమాల్లో మేజర్ ఒకటి. ముంబై బాంబు దాడుల్లో అమర వీరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. దేశవ్యాప్తంగా ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో చూశాం కదా. శేష్ తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. సందీప్ పాత్రలో శేష్ పెర్ఫార్మన్స్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు ఈ మూవీకి ప్రధాన బలంగా నిలిచాయి.
సిద్దు జొన్నలగడ్డ – డీజే టిల్లు
సిద్దు జొన్నల గడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా డీజే టిల్లు. ఈసినిమా ఫిబ్రవరి 12 న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. పూర్తిగా తెలంగాణ యాసలో సిద్దు చేసిన కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈసినిమాకే తన నటనే ఒక హైలెట్ అని చెప్పడంతో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ఈసినిమాకు విమల్ కృష్ణ డైరెక్టర్ అయినా కూడా సిద్దూ హీరోగా చేస్తూనే ఈసినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం.
కళ్యాణ్ రామ్ – బింబిసార
కళ్యామ్ రామ్ కెరీర్ లోనే చేసిన డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా బింబిసార. ఈసినిమాను చాలా సైలెంట్ గా పూర్తి చేసి రిలీజ్ చేశాడు కళ్యాణ్ రామ్. మల్లిడి విశిష్ట దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో కళ్యాణ్ రామ్ రెండు పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందుకే ఈసినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది.
నిఖిల్ – కార్తికేయ2
ఈసినిమా కార్తికేయ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సినిమా హిట్ అవ్వడంతో ఈసీక్వెల్ ను రూపొందించారు. ఈసినిమాకు కూడా కరోనా వల్ల బ్రేక్ వచ్చింది. అయినా కూడా అన్ని సమస్యలను ఎదుర్కొని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈసినిమా ద్వారక శ్రీకృష్ణ కథాంశంతో రాగా అందరికీ నచ్చడంతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. హిందీలో కూడా ఈసినిమా మంచి హిట్ ను అందుకుంది.
[totalpoll id=”92473″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: