లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో వస్తున్న హార్రర్ సినిమా కనెక్ట్. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కించారు. ఈసినిమా తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈసినిమా తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేయనున్నారు. దీనిలో భాగంగానే ఇక్కడ కూడా ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే నయనతార ఇక్కడ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార టాలీవుడ్ స్టార్స్ గురించి ఒక్క మాటలో చెప్పుకొచ్చారు. అగ్రహీరోలైన చిరంజీవి గురించి చెబుతూ ఆయన తన స్టార్ డమ్ ను ఆటిట్యూట్ ను అస్సలు చూపించరని.. బాలకృష్ణ గురించి చెబుతూ.. మరో టేక్ గురించి అడగాలంటే భయపడతారు.. కానీ ఆయన చాలా హ్యాపీ పర్సన్.. ఇంకా వెంకటేష్ తన ఫ్యామిలీ లాగ అని.. నాగార్జున ఛార్మర్ అని తెలిపింది. వీరితో పాటు రవితేజ తన బెస్ట్ ఫ్రెండ్ అని.. ప్రభాస్ చిన్నపిల్లాడు లాంటి వాడు సెట్ అటు ఇటు తిరుగుతుంటాడు.. జోక్స్ వేస్తుంటాడు.. నేను ఇప్పటివరకూ చూసిన హీరోల్లో ఎన్టీఆర్ ఒక్కడే రిహార్సల్స్ చేయడు.. రిహార్సల్ చేద్దామని అడుగినా కావాలంటే మీరు చేయండి.. నేను రెడీ అంటాడు అని నయన్ తెలిపింది.
ఇంకా ఈసినిమాలో ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, సత్యరాజ్, వినయ్ రాయ్, హనియ నఫిస కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విఘ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈసినిమాను డిసెంబర్ 22 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: