టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాలతో ఇప్పటికే డిఫరెంట్ గా విభిన్నంగా సినిమాలు తీస్తాడన్న పేరు తెచ్చుకున్నాడు. ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమా ఇది. ఈసినిమాలో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. పాన్ ఇండియా ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా.. టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం హనుమాన్ టీమ్ ముంబై లో కీలకమైన అండర్ వాటర్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తోంది. యంగ్ విజనరీ ప్రశాంత్ వర్మ దీనిని గ్రాండ్ కాన్వాస్ పై చిత్రీకరిస్తున్నాడు. రాజమౌళి ఆర్ఆర్ఆర్, రామ్ చరణ్, శంకర్ సినిమాలు కూడా గతంలో ఇదే టీంతో ఇలాంటి సీక్వెన్స్ ని రూపొందించాయి. పర్ఫెక్షనిస్ట్‌గా పేరుపొందిన ప్రశాంత్ వర్మ ఈ కష్టమైన సీక్వెన్స్ కోసం తేజకు హైదరాబాద్‌లో పదిహేను రోజుల పాటు స్పెషల్ ట్రైనర్ దగ్గర శిక్షణ ఇప్పించారు . ఇది చాలా రిస్కీ సీక్వెన్స్. దీని కోసం తేజ ఊపిరి తీసుకోకుండా నీటిలో ఉండవలసి ఉంటుందట. అయితే తేజ దానిని పట్టుదలతో ప్రాక్టీస్ చేసి చాలా బాగా ఎగ్జిక్యుట్ చేసినట్టు.. అవుట్ పుట్ ప్రేక్షకుడిని ఆశ్చర్యపరుస్తున్నట్టు తెలుస్తుంది.
కాగా `హనుమాన్` ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: