తమిళ హీరో విశాల్ కు కూడా తెలుగులో ఎంత మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే కదా. అందుకే తన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. దాదాపు ఆయన సినిమాలు అన్ని తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తున్న సినిమా లాఠీ. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుంత అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్ తో పాటు పలు పోస్టర్లు రిలీజ్ చేయగా.. వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. ఈనేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను డిసెంబర్ 12 న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ నందా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈసినిమాలో హీరోయిన్ గా సునయన నటిస్తుంది. బాలసుబ్రమణ్యన్ సినిమాటోగ్రాఫర్ గా, సామ్ సిఎస్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈసినిమాను ఈనెలలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: