ధమాకా పై రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Raviteja Interesting Comments About Dhamaka Movie, Raviteja About Dhamaka Movie, Raviteja Interesting Comments, Raviteja's Dhamaka Movie, Ravi Teja, Sreeleela, Jayaram, Rao Ramesh, Bheems Ceciroleo, Trinadha Rao Nakkina, Ravi Teja Movies, Ravi Teja Latest Movie, Ravi Teja Upcoming Movie, Dhamaka, Dhamaka Movie, Dhamaka Telugu Movie, Dhamaka 2022, Dhamaka Latest News, Dhamaka Movie Latest News And Updates, Dhamaka Movie Live Updates, Dhamaka New Update, Dhamaka News, Dhamaka Update, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

సినిమా జయాపజయాలతో పనిలేకుండా మాస్ మహారాజా రవితేజ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో అలరించిన రవితేజ ఇప్పుడు ధమాకా అంటూ సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే తాజాగా రవితేజ కూడా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చించారు. ఇక ఈసందర్భంగా రవితేజ ఈసినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఈమధ్య తన సినిమాల్లో మిస్ అవుతున్న కామెడీ టైమింగ్ అలానే మాస్ స్టైప్పులు కూడా ఉంటాయని అంతేకాదు.. ఈ సినిమా నుండి తనకు ఇష్టమైన పాట జింతాక్ అని మరియు ఈ చిత్రం థియేటర్లలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది అని చెప్పాడు. దీంతో ఈసినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. చూద్దాం మరి ఈ ఏడాది రవితేజ నుండి వస్తున్న మూడో సినిమా ఇది. ఈసినిమా రవితేజ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఈసినిమాలో పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − one =