ఖుషి-సమంత పై టీమ్ క్లారిటీ

Samantha Team Clarity About Kushi Movie, Clarity About Kushi Movie, Samantha Team Clarity, Vijay Deverakonda, Samantha Ruth Prabhu, Jayaram, Murali Sharma, Hesham Abdul Wahab, Shiva Nirvana, Vijay Deverakonda Latest Movie, Vijay Deverakonda Upcoming Movie, Vijay Deverakonda Movies, Kushi, Kushi 2023, Kushi Movie, Kushi Telugu Movie, Kushi Update, Kushi News, Kushi Latest News, Kushi New Update, Kushi Movie Live Updates, Kushi Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. మ‌హాన‌టి త‌ర్వాత విజ‌య్‌దేవ‌ర‌కొండ, స‌మంత క‌లిసి న‌టిస్తోన్నసినిమా ఇది. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయింది. కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇదిలా ఉండగా ఈసినిమా గురించి గత కొద్దిరోజులుగా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈసినిమాలో సమంత ప్లేస్ లో మరో హీరోయిన్ కోసం మేకర్స్ ట్రై చేస్తున్నట్టుగా ప్రచారం మొదలైంది. తాజాగా కృతి శెట్టిని తీసుకోవడం జరిగిపోయిందని అంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఆవార్తలు మరింత ఎక్కువవ్వడంతో తాజాగా ఈ వార్తలపై సమంత టీమ్ ఖండిస్తూ వార్తలను ఖండించింది. ఈ సినిమా షూటింగు 60 శాతం వరకూ పూర్తయిందనీ, అలాంటి ప్రాజెక్టులోకి మరో హీరోయిన్ ను ఎలా తీసుకుంటారని మేకర్స్ అన్నారు. ఈ సినిమాలో సమంత మాత్రమే కథానాయిక అనీ .. ఈ కథలో సెకండ్ హీరోయిన్ కూడా ఉండదని స్పష్టం చేశారు. మరి దీంతో ఇప్పటికైనా ఈవార్తలకు బ్రేక్ పడుతుందేమో చూడాలి.

ఇంకా ఈసినిమాలో జయరామ్, సచిన్ ఖడేఖర్, అలి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మిస్తున్నారు. అయితే ముందు ఈసినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు.. కానీ షూటింగ్ లేట్ అవ్వడంతో ఈసినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.