పుష్ప రష్యన్ ట్రైలర్ రిలీజ్

Allu Arjun Pushpa Movie Russian Trailer Released, Pushpa Movie Russian Trailer Released, Allu Arjun Pushpa Movie, Pushpa Movie Russian Trailer, Allu Arjun Pushpa Movie, Russian Trailer, Pushpa: The Rise, Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna, Sunil, Devi Sri Prasad, Sukumar, Allu Arjun Latest Movie, Allu Arjun's Upcoming Movie, Pushpa, Pushpa 2022, Pushpa Movie, Pushpa Telugu Movie, Pushpa Update, Pushpa News, Pushpa Latest News, Pushpa New Update, Pushpa Movie Live Updates, Pushpa Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

మన తెలుగు సినిమాల రేంజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా మన మేకర్స్ తెలుగు సినిమా సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాల గురించి తెలిసినా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా నుండి మరింత గుర్తింపు వచ్చింది. ఇక గత ఏడాది వచ్చిన పుష్ప సినిమా కూడా అంతర్జాతీయంగా ఎంత క్రేజ్ ను సొంతం చేసుకుందో చూశాం. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన పుష్ప పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. తగ్గేదేలే అనే డైలాగ్ అయితే ఇప్పుడు పెద్దవారి నుండి చిన్నవారి వరకూ అందరూ వాడేస్తున్నారు. ముఖ్యంగా ఈసినిమాలోని పాటలు ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా రీల్స్ చేసి మరి ట్రెండ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమాను రష్యాలో కూడా రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 8వ తేదీన రష్యాలో విడుదలవుతోంది. డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రీమియర్స్ వేయనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ప్రీమియర్స్‌కు అల్లు అర్జున్, రష్మిక మందన, సుకుమార్ సహా చిత్ర బృందం మొత్తం వెళ్లనుంది. ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు రష్యన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ ను చూస్తుంటే ముందు డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు అర్థమవుతుంది. లిప్ సింక్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. తెలుగులో ఉన్న డైలాగ్స్ రష్యన్ లో వింటుంటే కొత్తగా అనిపిస్తుంది.


కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 4 =