జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ మానియా తగ్గేదేలే

RRR Massive Collections at Japan Box Office, RRR Collections at Japan Box Office, Japan Box Office Collections, RRR Massive Collections, RRR Collections, S. S. Rajamouli, Ajay Devgn, Ram Charan, NTR, Alia Bhatt, Olivia Morris, Rajamouli's RRR, RRR, RRR 2022, RRR Movie, RRR Telugu Movie, RRR Movie Latest News, RRR Telugu Movie Update, RRR Movie Live Updates, RRR Movie Latest News And Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ ఆర్ ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. జపాన్ లో టోటల్ రన్ లో రజనీకాంత్ ముత్తు మూవీ 400 మిలియన్ తో మొదటి స్థానం , ప్రభాస్ బాహుబలి 2 300 మిలియన్ కలెక్షన్స్ తో రెండవ స్థానం లో నిలిచాయి. తాజాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ 304 M యెన్స్‌( 17 కోట్లు )పైగా కలెక్ట్ చేసి. బాహుబలి 2 మూవీ కలెక్షన్స్ రికార్డ్ ను క్రాస్ చేసి , జపాన్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రెండవ సౌత్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ ని జపాన్ లో దాదాపు 2 లక్షల మంది వీక్షించడం విశేషం.ఇండియా లో తమ అభిమాన హీరో తెరపై కనిపిస్తే అభిమానులు కాగితాలు విసిరి హల్‌చల్‌ చేస్తుంటారు. ఇప్పుడు ఇదే ట్రెండ్‌ జపాన్‌లో కనిపిస్తోంది.అక్కడి ఆర్‌ఆర్‌ఆర్‌ అభిమానులు సినిమా వీక్షిస్తూ తెరపై కాగితాలు విసురుతూ.. డ్యాన్స్‌లు చేస్తూ థియేటర్లలో సందడి చేస్తున్నారు. దూర ప్రాంతాలనుండి జపాన్ ప్రేక్షకులు ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్స్ కు రావడం విశేషం. ఇప్పట్లో జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ మానియా తగ్గేదేలే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 10 =