అనారోగ్య వార్తలపై కన్నడ హీరో ఉపేంద్ర స్పందన

Actor Upendra, Kannada Superstar Upendra, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Rumors Upendra Health Condition, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates, Upendra about his health issues, Upendra complained of breathing issues, Upendra health issues, Upendra Latest Movie, Upendra opens up about his health issues, Upendra’s Upcoming Movie

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో , దర్శకుడు ఉపేంద్ర , ఆ మూవీస్ డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. కన్యాదానం , సన్నాఫ్ సత్యమూర్తి, గని వంటి తెలుగు స్ట్రయిట్ మూవీస్ తో ఉపేంద్ర ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరో ప్రస్తుతం కబ్జా, త్రిశూలం, ‘బుద్ధిమంత 2, యూఐ కన్నడ మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఉపేంద్ర అస్వస్థతకు గురయ్యారంటూ నిన్న సాయంత్రం నుంచి వార్తలు వెల్లువెత్తుతున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బంది పడ్డారని, చిత్ర బృందం ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించిందని వార్తలు వచ్చాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఉపేంద్ర తన ఆరోగ్యంపై స్పష్టతనిచ్చారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం తాను యూఐ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాననీ , షూటింగ్ జరుగుతున్న లొకేషన్లో దుమ్ము ఎక్కువగా ఉండటంతో కొంచెం ఇబ్బందికి గురయ్యాననీ , దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి వెళ్లి వచ్చాననీ , ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందనీ , అసత్య ప్రచారాలు చేయకండనీ , ఇప్పుడు కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నాననీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + seven =