ప్రదీప్ రంగనాథన్, ఇవాన జంటగా తెరకెక్కిన సినిమా లవ్ టుడే. తమిళ్ లో రూపొందించిన ఈసినిమా నవంబర్ 4 వ తేదీన రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈసినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇక ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి తెలుగులో ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు..ప్రదీప్ రంగనాథన్, ఇవాన, సత్యరాజ్ , రాధిక , యోగిబాబు తదితరులు
దర్శకత్వం.. ప్రదీప్ రంగనాథన్
బ్యానర్స్.. ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు.. కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్
సినిమాటోగ్రఫి.. దినేష్ పురుషోత్తమన్
సంగీతం.. యువన్ శంకర్ రాజా
కథ
ఇదొక ప్రేమకథ అని ఇప్పటికే టీజర్, ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది.
ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్), నికిత (ఇవాన) ఎంతో కాలంగా ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే నికితకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో తన తండ్రితో మాట్లాడాలని ప్రదీప్ ను కోరుతుంది. ఇక వీరి ప్రేమ గురించి తెలుసుకున్న నికిత తండ్రి వేణు శాస్త్రి (సత్యరాజ్) వారిద్దరితో తను వారి ప్రేమకు అడ్డుకాదని చెప్పి ఒక కండీషన్ పెడతాడు. ఒక రోజు ఇద్దరూ తమ ఫోన్స్‌ను మార్చుకోవాలని అంటాడు. దాంతో ఇద్దరూ భయపడతారు. ఫైనల్ గా వేణు శాస్త్రి చెప్పిన కండీషన్ కు ఓకే చేసి ఫోన్స్ మార్చుకుంటారు. ఇక ఫోన్ మార్చుకున్న తరువాత వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు జరిగాయి? ఒకరి గురించి మరొకరికి ఎలాంటి సీక్రెట్స్ తెలిసాయి? చివరకు వారి ప్రేమ కథ ఎలా ముగిసింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఇప్పుడు ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలోకి రిలీజ్ చేయడం కామన్ అయిపోయింది. అది రీమేక్ చేసి అయినా సరే.. డబ్బింగ్ వెర్షన్ అయినా సరే రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇటీవలే కాంతార సినిమాను డబ్బింగ్ చేసి రిలీజ్ చేయగా అది ఎంత ప్రభంజనం చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు అలానే తమిళ్ లో హిట్ అయిన లవ్ టుడే సినిమాను రిలీజ్ చేశారు. ఈసినిమా తమిళ్ లో హిట్ అవ్వడంతో మాములుగానే అంచనాలు ఏర్పడ్డాయి. అదే ఈసినిమా చూడటానికి ప్రేక్షకుల్లో ఆసక్తిని కూడా పెంచాయి.
ఈరోజుల్లో టెక్నాలజీ ఎంత పెరిగిందే తెలిసిందే. ముఖ్యంగా మనిషి జీవితంలో సెల్ ఫోన్ భాగస్వామ్యం అయిపోయింది. ఒక మనిషి గురించి తెలియాలంటే ఇప్పుడు వేరే మనిషిని అడగటం కాదు.. అతని ఫోన్ ను చూస్తే సరిపోతుంది అన్న రోజులు వచ్చాయి. ముఖ్యంగా యువత.. యువత ఫోన్ కు ఎలా ఎడిక్ట్ అయిందో చూపించారు. ఫోన్‌ను ఎలా వాడుతున్నారు.. వాటి వల్ల ఎదురయ్యే ప్రమాదాలు ఏంటి?.. సోషల్ మీడియా వాడకం ఎలా ఉంటోంది అన్న విషయాల ప్రధానంశంగా ఈసినిమా తెరకెక్కించాడు ప్రదీప్. దానిని లవ్ స్టోరీతో చూపించడం అనేది ఈసినిమాకు కలిసొచ్చిన అంశం అని చెప్పొచ్చు.
ఫస్ట్ హాఫ్ అంతా ప్రదీప్, నిఖితల పరిచయ సన్నివేశాలు, ఫ్రెండ్స్ గ్యాంగ్ . ఇలా నార్మల్ గా వెళుతుండగా.. ఎప్పుడైతే వేణు శాస్త్రి ఫోన్లు మార్చుకునే కండీషన్ పెడతాడో .. అక్కడి నుంచి ఫన్ రైడ్ మొదలవుతుంది. ఫోన్ తిరిగి తెచ్చుకోవడానికి వేసిన ప్లాన్స్, సి టైప్ చార్జర్ కోసం ప్రదీప్ పడే తంటాలు, నిఖిత పాత బాయ్ ఫ్రెండ్ వాయిస్ మెసేజులు, బుజ్జికన్నా డీజే పాట .. అన్నీ హిలేరియస్ గా వర్క్ అవుట్ అయ్యాయి. సకండ్ హాఫ్ లో చాలా వరకూ కథనం సీరియస్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది. మొబైల్ వాడకంలోని ప్రమాదాన్ని తెలిపారు.
పెర్ఫామెన్స్
ఇక ఈమధ్య హీరోలు పెద్ద పెద్ద కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా చాలా లైట్ వెయిటెడ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలు పెద్ద హడావుడి లేకుండా సినిమాలు చేసుకుంటూ హిట్లు కొడుతున్నారు. ఇక ఈసినిమాలో చేసిన ప్రదీప్ కూడా చాలా సహజంగా తన పాత్రకు తగ్గట్టుగా నటించాడు. ఇక హీరోయిన్ ఇవాన కూడా నిఖిత పాత్రలో చక్కగా నటించడమే కాకుండా.. అందంగా కనిపించింది. యూత్‌కు ఇవానా బాగానే కనెక్ట్ అవుతుంది. ఇక సత్యరాజ్, రాధికల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అనుభవంతో తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు. యోగిబాబు ఎప్పటిలాగే తన కామెడీతో నవ్వించేశాడు.. అంతేకాదు ఎమోషనల్ యాంగిల్ ను కూడా చూపించాడు. రొటీన్‌కు భిన్నంగా కాస్త ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చాడు. నవ్వించేశాడు. అదే సమయంలో ఆలోచింపజేశాడు. హీరో ఫ్రెండ్స్ కారెక్టర్స్ కూడా బాగానే పండాయి. మిగిలిన వారు తమ పాత్రల మేర నటించి మెప్పించారు.
టెక్నికల్..
ఈసినిమాకు విజువల్స్, సంగీతం కూడా మరో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. దినేష్ పురుషోత్తమన్ విజువల్స్ ..చిన్న సినిమాకు రిచ్ లుక్ తెచ్చాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా యూత్ కు కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అంతేకాదు సెలఫోన్ తో ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా తెలియచేస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: