భూమికోసం (1974 ) మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన జయప్రద పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరించారు. తెలుగు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల లో జయప్రద సుమారు 300 సినిమాలలో నటించారు. దక్షిణాది తో పాటు హిందీ భాషలో టాప్ హీరోలతో జయప్రద జోడీగా నటించారు. సూపర్ స్టార్ కృష్ణ తో 45 సినిమాలలో జోడీగా నటించి జయప్రద రికార్డ్ క్రియేట్ చేశారు. అంతులేని కథ , సిరిసిరి మువ్వ , సాగర సంగమం మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జయప్రద బెస్ట్ యాక్ట్రెస్ AWRDS అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావుశతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీర్ తో కలిసి పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించిన జయప్రదను ఎన్టీఆర్ శతజయంతి అవార్డు కై ఎంపిక చేశారు. 1970 – 80 దశకాలలో ఆమె ఎన్టీఆర్ తో కలిసి చేసిన సినిమాలలో అడవి రాముడు .. యమగోల .. యుగపురుషుడు .. సూపర్ మేన్ వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. నటిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన జయప్రదకు, ఈ నెల 27వ తేదీన తెనాలిలోని ఎన్వీ ఆర్ కన్వెన్షన్ లో ఎన్టీఆర్ అవార్డును , బంగారు పతకం అందజేయనున్నారు. లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: