తండ్రిపై మహేష్ ఎమోషనల్ పోస్ట్

Mahesh Babu Emotional Post About Father Krishna, Mahesh Babu's Father Krishna, Mahesh Babu Emotional Post, Superstar Krishna’s Legacy, Mahesh Babu Carries Krishna’s Legacy, Krishna’s Legacy, Mahesh Babu, Pooja Hegde, Samyuktha Menon, S. Thaman, Trivikram Srinivas, Mahesh Babu Latest Movie, Mahesh Babu's Upcoming Movie, SSMB28, SSMB28 2022, SSMB28 Latest Update, SSMB28 New Update, SSMB28 Telugu Movie, SSMB28 Telugu Movie Live Updates, SSMB28 Movie Latest News And Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

సూపర్ స్టార్, లెజెండరీ నటుడు కృష్ణ ఈనెల 15వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా వయోభారంతో వచ్చే అనారోగ్యం సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. ఈనేపథ్యంలోనే ఆయనకు గుండెపోటు రావడంతో కాంటినెంటల్ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణ తుదిశ్వాస విడిచారు. కృష్ణ అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఈనెల 16న జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగించారు. ఇక విజయవాడలోని కృష్ణా నదిలో తన తండ్రి అస్థికలను కూడా నిమజ్జనం చేశారు. ఇక కృష్ణ మరణంతో ఆయన కుటుంబం ప్రస్తుతం విషాదంలో ఉంది. ఇక మరోపక్క తెలుగు ఇండస్ట్రీ కూడా ఆయన మరణాన్ని జీర్ణంచుకోలేకపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తండ్రి మరణంతో ప్రస్తుతం మహేష్ అయితే విచారంలో ఉన్నారు. ఈనేపథ్యంలో తండ్రిని తలుచుకుంటూ తన ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేశారు. మీ జీవితాన్ని ఎంతో ఆనందంగా గడిపారు.. మీరు వెళ్లిపోవడంతో కూడా అంతకన్నా గొప్పగా జరిగింది…అదే మీ గొప్పతనం.. మీ జీవితాన్ని మీరు నిర్భయంగా గడిపారు. డేరింగ్ అండ్ డాషింగ్ మీ నైజం.. నా స్పూర్తి, నా ధైర్యం మీలో నేను చూసుకున్నవన్నీ మీతేనే వెళ్లిపోయాయి.. కానీ ఇప్పుడు కొత్త శక్తిని నాలో అనుభవిస్తున్నాను.. నేను ఇప్పుడు నిర్భయంగా ఉన్నాను.. మీలోని వెలుగు నాలో ఎప్పటికీ ప్రకాశిస్తుంది. మీ లెగసీని నేను ముందుకు తీసుకెళ్తాను.. మీరు మరింత గర్వపడేలా చేస్తాను లవ్ యూ నాన్న అంటూ భావోద్వేగమైన పోస్ట్ ను చేశారు.

ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here