ఈవారం ఓటీటీ లో రిలీజ్ కానున్న సినిమాలు

This Week Ott Release Movies And Series, Ott Release Movies, Ott Release Series, This Week Ott Release Movies, Rishab Shetty, Sapthami Gowda, Kishore, Vijay Kiragandur, Rishab Shetty Latest Movie, Rishab Shetty's Upcoming Movie, Kantara, Kantara 2022, Kantara Movie, Kantara Update, Kantara Latest News, Kantara Telugu Movie, Kantara Latest Update, Kantara Live Updates, Kantara Latest News And Updates, Kantara Telugu Movie Latest Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

ఇప్పుడు ఓటీటీ హవా ఏ రేంజ్ లో ఉందో చూస్తూనే ఉన్నాం కదా. థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ ఓటీటీ హవా ఏ మాత్రం తగ్గలేదు. ప్రతి వారం ఓటీటీలో సందడి చేయడానికి చాలా సినిమాలు క్యూ కడుతూనే ఉన్నాయి. ఇక ఈవారం కూడా అరడజనుకు పైగా సినిమాలు క్యూ కట్టాయి. వాటిలో కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతుండగా.. కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయి ఇప్పుడు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* ముందుగా కన్నడలో సూపర్ హిట్ అయి ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాంతార సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దమవుతుంది. ఈసినిమా నవంబర్ 24వ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ లో రిలీజ్ కానుంది.

* అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన సినిమా ప్రిన్స్. ఈ సినిమా ఈమధ్యే రిలీజ్ అయి థియేటర్లలో సందడి చేసింది. ఇక ఇప్పుడు ఈసినిమా కూడా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రిన్స్ సినిమా హాట్ స్టార్ లో నవంబర్ 25వ తేదీన రిలీజ్ కానుంది.

* న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా తన సోదరి దీప్తి గంటా దర్శకత్వంలో వస్తున్న సిరీస్ మీట్ క్యూట్. ఐదు స్టోరీలను ఈ సిరీస్ లో చూపించనున్నారు. ఇక ఈసిరీస్ డైరెక్ట్ గా సోనీ లివ్ లో నవంబర్ 25వ తేదీన రిలీజ్ కానుంది.

* దుల్కర్ సల్మాన్, శ్రియా ధన్వంతరి హీరోహీరోయిన్లుగా దర్శకుడు ఆర్.బాల్కీ తెరకెక్కించిన చిత్రం ‘చుప్’. సన్నీ డియాల్ ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో దుల్కర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాకుండా ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. ఈ నెల 25వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో ‘చుప్’ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

* లిజు కృష్ణ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ పడవేట్టు. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. నవంబర్ 25వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో ఈసినిమా రిలీజ్ కాబోతుంది.

ఇంకా వీటితో పాటు గుజరాతి, హిందీ లో వచ్చిన లాస్ట్ ఫిలిం షో నవంబర్ 25వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో అలానే ఖాకీ ది బీహార్ చాప్టర్ అనే హిందీ సిరీస్ కూడా నవంబర్ 25 నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + six =