మహేష్ ఎప్పుడంటే అప్పుడే సినిమా

Anil Ravipudi About Movie With Mahesh Babu, Anil Ravipudi About Mahesh Babu, Movie With Mahesh Babu, Anil Ravipudi, Anil Ravipudi Latest Movie, Anil Ravipudi's Upcoming Movie, Pataas, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

పటాస్ సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు అనిల్ రావిపూడి. ఇక ఈ ఏడేళ్లలో తను ఎలాంటి ఫ్లాప్స్ లేకుండా కేవలం సక్సెస్ ను మాత్రమే సొంతం చేసుకొని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ ఆరు సినిమాలు చేశాడు. ఆరు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందించాయి. ఇటీవలే ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 తీసి మంచి హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి బాలకృష్ణతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ప్రస్తుతం ఎక్కువగా డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు వస్తున్నాయి.. నాకు కూడా అలాంటి సినిమా చేయాలని ఉంది.. కానీ దానికి ఇంకా రెండు మూడేళ్లు టైమ్ పడుతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో సాయితేజ్ అలానే వరుణ్ తేజ్ తో సినిమాలు చేశాను. మిగతా మెగా హీరోలతో కూడా సినిమాలు చేయాలని ఉంది. అయితే అందుకు పరిస్థితులు అనుకూలించాలి. ఇక మహేశ్ బాబుగారితో సినిమా మళ్లీ ఎప్పుడని అంతా అడుగుతున్నారు. ఆయన ఎప్పుడంటే అప్పుడే అని సమాధానం ఇచ్చారు. చూద్దాం మరి అనిల్ రావిపూడి తన లిస్ట్ ను ఎప్పుడు ఫుల్ ఫిల్ చేసుకుంటాడో.

కాగా షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఈమూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల ఈ చిత్రంలో బాలకృష్ణ కూతురిగా నటించనుందని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 13 =