మాస్ సినిమాలు నేను తీయలేను

Krishna Vamsi about directing Mass Movies,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Telugu Filmnagar,Krishna Vamsi Movies,Krishna Vamsi New Movie,Krishna Vamsi Latest Movie,Krishna Vamsi Latest News,Krishna Vamsi Upcoming Movies,Krishna Vamsi Next Movie,Krishna Vamsi Upcoming Project,Krishna Vamsi Next Project,Krishna Vamsi Latest Project,Krishna Vamsi New Project,Krishna Vamsi New Movie Update,Krishna Vamsi Latest Film Updates,Krishna Vamsi Movie Updates,Krishna Vamsi News,Krishna Vamsi about Mass Movies,Krishna Vamsi about Movies,Krishna Vamsi Interview,Krishna Vamsi Latest Interview,Krishna Vamsi Talks About directing Mass Movies,

టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ ఎవరంటే కృష్ణవంశీ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రైమ్, ఫ్యాక్షన్ సినిమాలను ఎలా తీస్తాడో కలర్ ఫుల్ సినిమాలు తీయడంలో దిట్ట. ఇంటినిండా జనం, పూలు పండ్లూ ఇలా చాలా కలర్ ఫుల్ గా ఉంటాయి. ప్రస్తుతం నానా పాటేకర్ హీరోగా నటించిన మరాఠీ మూవీ ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కృష్ణవంశీ ఈసినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూల్లో పాల్గొన్న కృష్ణవంశీని మాస్ సినిమా ఎప్పుడు తీస్తున్నారు అంటూ అడుగగా.. మాస్ సినిమాలు చేయడం నాకు చేతకాదు. అలాంటి సినిమాలు చేయడం నాకు రాదు. అసలు మాస్ సినిమాకి డెఫినేషన్ ఏమిటనేది నాకు ఇంకా తెలియలేదు. నా సినిమాలు పాజిటివ్ గా ఉండాలి.. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఉండాలి.. కలర్ ఫుల్ గా ఉండాలి.. ప్రోగ్రెసివ్ గా ఉండాలి.. మేనర్స్ ఉండాలి.. వ్యాల్యూ సిస్టం ఉండాలి.. స్టాండర్డ్స్ ఉండాలి.. హ్యుమానిటీ ఉండాలి అంటూ తెలిపారు. నేను రెగ్యులర్ గా వెబ్ సిరీస్ లు.. సినిమాలు చూస్తూనే ఉంటాను. శేఖర్ కమ్ముల సినిమాలంటే నాకు ఇష్టం. నా సినిమాల్లో హీరోయిన్స్ నచ్చుతారని అంతా అంటూ ఉంటారు. కానీ నాకు తన సినిమాల్లోని హీరోయిన్స్ నచ్చుతారు. ‘లవ్ స్టోరీ’ కూడా చాలా బాగా తీశాడు అంటూ పేర్కొన్నాడు.

కాగా ఈసినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌ తో పాటు ర‌మ్య‌కృష్ణ‌, బ్ర‌హ్మానందం, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ సిప్లిగంజ్ ఇత‌ర నటీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అంతేకాదు ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 3 =