హిట్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Hit 2 Movie Trailer Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,HIT 2,HIT 2 Movie,HIT 2 Telugu Movie,HIT 2 Movie Updates,HIT 2 Movie Latest News,HIT 2 Update,HIT 2 Latest Update,HIT 2 Movie Latest Update,HIT 2 Trailer,HIT 2 Movie Trailer,HIT 2 Telugu Movie Trailer,HIT 2 Movie Trailer Update,HIT 2 Trailer Update,HIT 2 Movie Trailer Latest Update,HIT 2 Trailer Latest Update,HIT 2 Trailer Release Date,HIT 2 Movie Trailer Release Date,Adivi Sesh,Adivi Sesh Movies,Adivi Sesh New Movie,Adivi Sesh Latest Movie,Adivi Sesh HIT 2,Adivi Sesh HIT 2 Movie,Adivi Sesh HIT 2 Trailer,Adivi Sesh HIT 2 Movie Trailer,HIT: The Second Case,Nani,HIT2 Trailer out on Nov 23rd,HIT2 on Dec 2,Hit 2 Trailer Announcement,Adivi Sesh,Hit 2 Movie Trailer Announcement,Hit 2 Movie Trailer Release Date Announcement,HIT2 Trailer on Nov 23rd

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు అడివి శేష్ ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో సస్పెన్స్ థ్రిల్లర్ తో థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా హిట్ 2. రెండేళ్ల క్రితం వచ్చిన హిట్ సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అయితే మొదటి పార్ట్ లో విశ్వక్ సేన్ నటించగా.. రెండో పార్ట్ లో అడివి శేష్ నటిస్తున్నాడు. ఇక ఈసీక్వెల్ పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా డిసెంబర్ 2వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ అన్నీ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇప్పుడు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో హీరో అడివి శేష్, నిర్మాత నాని కలిసి ఓ వీడియో ద్వారా ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.

కాగా ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించ‌నుంది. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. ఈసినిమా డిసెంబర్ 2, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − two =