సూపర్ స్టార్ కృష్ణ నిన్న మరణించిన సంగతి తెలిసిందే. మొన్న ఉదయం గుండెపోటుకు గురైన కృష్ణను కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి కాస్త విషమించడంతో నిన్న తెల్లవారు జామున కృష్ణ తుదిశ్వాస విడిచారు. ఈరోజు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు కూడా ముగిశాయి. ఇక ఇదిలా ఉండగా తాజాగా మనవరాలు కృష్ణ తన తాతను గుర్తుచేసుకొని సోషల్ మీడియా ద్వారా గుర్తుచేసుకుంది. వీక్ డే భోజనం మళ్లీ ఎప్పటికీ ఉండదు. మీరు నాకు చాలా విలువైన విషయాలు నేర్పించారు. ఎల్లప్పుడూ నన్ను నవ్వించారు, ఇప్పుడు మిగిలి ఉన్నది మీ జ్ఞాపకం. మీరు నా హీరో, ఏదో ఒక రోజు నేను మిమ్మల్ని గర్వపడేలా చేయగలనని ఆశిస్తున్నాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను తాత గారూ” అని పేర్కొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
కాగా తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కావు. ఆ రోజుల్లోనే టెక్నాలజీని పరిచయం చేసిన ఏకైక హీరో కృష్ణ. మొదటగా పలు నాటకల్లో నటించిన ఆయన ఆ తరువాత పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ఇక తేనెమనసులు సినిమాతో నటుడిగా అందరి ప్రశంసలందుకున్నారు కృష్ణ. తొలి చిత్రం సాధించిన విజయంతో కృష్ణ వెను దిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది ఇక తన సినీ ప్రయాణంలో 350 పైగా చిత్రాల్లో ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక,జేమ్స్‌బాండ్, కౌబాయ్ వంటి డిఫరెంట్ చిత్రాల్లో మెప్పించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: