యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలంలో ఎత్తయిన గుట్టపై ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తెలంగాణలోని ముఖ్య ఆలయాలలో ఒకటి.ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదమహర్షి తపస్సుకి మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారు . యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశారు . ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండక్రిందవున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగాఉన్నారు. స్వయంభువులైన పంచనారసింహుల ఆలయ పునర్నిర్మాణం పూర్తి కృష్ణశిలల తో జరగడంతో సర్వాంగ సుందరంగా తయారైన ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా హీరో నాని యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ను సందర్శించారు. హీరో నాని మాట్లాడుతూ .. గతంతో పోలిస్తే యాదాద్రి ప్రధానాలయం మహాద్భుతంగా రూపుదిద్దుకుందనీ , రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి ఆలయాన్ని ఎంతో చక్కగా పునర్నిర్మించిందనీ , పూర్తి కృష్ణశిలలతో నిర్మితమైన స్వామివారి ఆలయం చరిత్రలో నిలిచిపోనుందనీ , ఆలయ పునర్నిర్మాణానికి కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలనీ చెప్పారు. వైటీడీఏ అధికారులు, ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి, ప్రధాన స్తపతి, ఉపస్తపతులు, శిల్పులు, ఆలయ అధికారులకు నాని అభినందనలు తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: