వివేక్‌ అగ్నిహోత్రి ది వాక్సినేషన్‌ వార్‌

vivek agnihotri new movie the vaccine war announced, Director Of The Kashmir Files, Vivek Agnihotri, A New War Film, The Kashmir Files, Abhishek Agarwal Arts, The Kashmir Files Movie, The Vaccine War, The Vaccine War Movie, The Vaccine War Update, The Vaccine War New Update, The Vaccine War Latest Update, The Vaccine War Movie Updates, The Vaccine War Telugu Movie, The Vaccine War Telugu Movie Latest News, The Vaccine War Telugu Movie Live Updates, The Vaccine War Telugu Movie New Update, The Vaccine War Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

కరోనా నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో పలు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరో సినిమాతో రాబోతుంది. కాశ్మీర్ ఫైల్స్‌తో దేశవ్యాప్తంగా పాపులరైన బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి. ఇక ఇప్పుడు మరో సంచలనానికి తెరదీశాడు. నేడు వివేక్ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించాడు. ‘ది వ్యాక్సిన్ వార్’ అనే టైటిల్ తో కొత్త సినిమాను చేస్తున్నట్టు తెలిపాడు. కరోనా మహమ్మారిపై ఇండియా పోరాడి ఎలా గెలిచిందన్నదే ఈసినిమాలో చూపించబోతున్నట్టు అర్థమవుతుంది. టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. పోస్టర్ పై ‘ఏ వార్ యు డోంట్ నో యు ఫాట్ అండ్ వన్’ అనే బాటమ్ లైన్ ఉంది. అంటే ‘ఓ యుద్ధం.. మీకు తెలియదు.. పోరాడారు.. గెలిచారు’ అని అర్థం. దీనికోసం ఇప్పటికే వివేక్ రీసెర్చ్ కూడా చేసినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ముందే ప్రకటించారు. వచ్చే ఏడాది ఆగష్ట్ 15 వ తేదీన విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం 11 భాషల్లో ఈ మూవీ రిలీజవుతుందని తెలిపాడు. ఈ మూవీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, బంగ్లా, పంజాబీ, భోజ్ పురి, కన్నడ, తమిళ్, మలయాళం, గుజరాతీ, మరాఠీ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని అభిషేక్‌ అగర్వాల్ ఆర్ట్స్‌ బ్యానర్‌లో పల్లవి జోషి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 2 =