హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.లేటెస్ట్ గా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 305 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకొని ఫైనల్ గా 300 క్రోర్స్ క్లబ్ లో చేరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాంతార మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కాంతార మూవీ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బుధవారం బెంగళూరులో కుటుంబసభ్యులు మరియు సన్నిహితులతో కలిసి వీక్షించారు. కాంతార సినిమా ద్వారా కన్నడలోని తుళువనాడు మరియు కరవాలి వారి ఆచారాలను చాలా చక్కగా చూపించారనీ , రచయిత , దర్శకుడు మరియు నటుడు అయిన రిషబ్ శెట్టి అద్భుతమైన నటన కనబరచడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల జీవిన విధానాన్ని మరియు వారి ఆచారాల్ని చాలా చక్కగా చూపించారనీ ఆమె కాంతార టీమ్ ను ప్రశంసించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: