స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా యశోద. హరి హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమాతో పాన్ ఇండియా వద్ద తన సత్తా చూపించడానికి రెడీ అయిపోతుంది సమంత. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా సినీ థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈసినిమా నుండి ఇప్పటివరకూ రిలీజ్ అయిన ప్రతి ఒక్క అప్ డేట్ ఈసినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. ఇక ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటివరకు చూసుకుంటే సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన అన్ని సినిమాల్లోనూ.. డిఫరెంట్ గానే కనిపించింది. ప్రతి సినిమాలోనూ కొత్త యాంగిల్ లో కనిపించి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మరి ఈసినిమా కూడా డిఫరెంట్ గా వస్తుంది. మరి ఈసినిమా ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి.
#Yashoda‘s way to you is clear now 🔥
The Biggest Female Centric Pan-Indian film gets censored with U/A 💥https://t.co/J4JjUgv1WU#YashodaTheMovie @Samanthaprabhu2 @varusarath5 @Iamunnimukundan @harishankaroffi @hareeshnarayan @krishnasivalenk #YashodaOnNov11th pic.twitter.com/K3uSA3jNva
— Sridevi Movies (@SrideviMovieOff) November 3, 2022
కాగా సమంత తో పాటు ఇంకా ఈసినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























