రంగమార్తాండ ప్రకాష్ రాజ్-బ్రహ్మీ ల టఫ్ సీన్

Rangamarthanda Movie Latest Update, Director Krishna Vamsi Talks About The Toughest Scene Between Brahmanandam And Prakash Raj, Toughest Scene Between Brahmanandam And Prakash Raj, Brahmanandam, Prakash Raj, Ramya Krishnan, Krishna Vamsi, Rangamarthanda, Rangamarthanda Movie, Rangamarthanda Update, Rangamarthanda New Update, Rangamarthanda Latest Update, Rangamarthanda Movie Updates, Rangamarthanda Telugu Movie, Rangamarthanda Telugu Movie Latest News, Rangamarthanda Telugu Movie Live Updates, Rangamarthanda Telugu Movie New Update, Rangamarthanda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా రంగమార్తాండ. ఎన్నో పరాజయాల తరువాత కృష్ణవంశీ నుండి వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈసినిమా మరాఠీలో విడుదలైన ‘నట సామ్రాట్’ సినిమాకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈసినిమాకు షూటింగ్ ఎన్నోసార్లు వాయిదా పడింది. అలా ఎన్నో అవాంతరాలు అందుకొని ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతంఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఒకరి తరువాత ఒకరు డబ్బింగ్ ను పూర్తిచేసుకుంటున్నారు. కృష్ణవంశీ కూడా అందుకు సంబంధించిన అప్ డేట్స్ కూడా ఇస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరి డబ్బింగ్ కు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేస్తూ అప్ డేట్స్ ఇస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చాడు కృష్ణవంశీ. తన ట్విట్టర్ లో బ్రహ్మానందం డబ్బింగ్ చెబుతున్న ఫొటోలు పోస్ట్ చేస్తూ బ్రహ్మానందం-ప్రకాష్ రాజ్ మధ్య 10నిమిషాలు కంటిన్యూా ఉండే టఫ్ సీన్ ఉంటుంది అని తెలియచేశారు. ‘నట సామ్రాట్’ సినిమాలో నానా పటేకర్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన పాత్రను తెలుగులో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారు. అలానే సినిమాలో మరో ముఖ్య పాత్ర ఒకటి ఉంటుంది. నానా పటేకర్ స్నేహితుడిగా మరాఠీలో విక్రమ్ గోఖలే నటించారు. సీరియస్ గా ఎమోషనల్ గా సాగే ఆ పాత్ర కోసం బ్రహ్మానందాన్ని ఎంపిక చేశారు. ఈ పాత్ర చాలా సీరియస్ గా ఉండనున్నట్టు తెలుస్తుంది.

కాగా ఈసినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌, ర‌మ్య‌కృష్ణ‌, బ్ర‌హ్మానందం, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ సిప్లిగంజ్ ఇత‌ర నటీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అంతేకాదు ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − seven =